ఒకే రోజు 79,100 శాతం లాభం

ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవాళ మార్కెట్‌లో సంచలనం రేపింది. ఆర్బీఐ జరిపిన రివ్యూలో బ్యాంక్ రూ. 1600 కోట్లకు పైగా నష్టాన్ని పుస్తకాల్లో చూపలేదని తేలింది. డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్‌లో మార్కెట్ టు మార్కెట్ నష్టాన్ని చూపకపోవడం వల్ల లాభాలను కృత్రిమంగా ఎక్కువ చేసి చూపినట్లయింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే షేర్ భారీ నష్టంతో ప్రారంభమైంది. ఒకదశలో 30 శాతం క్షీణించింది. రూ. 900ల నుంచి రూ. 649లరే పడింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకున్నా రూ. 656 అంటే 27 శాతం నష్టంతో ముగిసింది. దీంతో ఈ షేర్ డెరివేటివ్స్‌లో భారీగా మారాయి. ముఖ్యంగా రూ. 650 పుట్ ఆప్షన్స్ ఎన్‌ఎస్‌ఈలో భారీగా పెరిగాయి. ఈనెల 27న ముగియనున్న ఈ స్ట్రయిక్‌తో ఉన్న పుట్ ధర నిన్న రూ. 0.05 అంటే 5 పైసలు కాగా ఇవాళ రూ. 39.70కి చేరింది. క్లోజింగ్‌లో స్వల్పంగా తగ్గి రూ. 35.90కి చేరింది. అంటే 79,100 శాతం పెరిగిందన్నమాట. మరి ఈ షేర్‌లో రేపు ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి మరి.