For Money

Business News

6.70% వడ్డీకే ఇంటి రుణం

పండుగల సమయంలో బ్యాంకులు పోటీ పడి వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. కార్పొరేట్‌ రుణాలు తీసుకునేవారు లేకపోవడంతో… బ్యాంకులు పూర్తిగా రీటైల్‌ రుణాలపైనే ఆధారపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల మధ్య పోటీ పెరుగుతోంది. ముఖ్యంగా హౌసింగ్‌ లోన్ల మార్కెట్‌లో పోటీ తీవ్రమైంది. ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాపారం, ఫ్లోటింగ్‌ రేటు పద్ధతి ఉండటంతో బ్యాంకులు ఈ రుణ మార్కెట్‌పై అధిక శ్రద్ధ చూపిస్తున్నాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీ రేటును తగ్గించింది. రెపో రేటు ఆధారంగా ఇచ్చే హౌసింగ్‌ లోన్‌పై వడ్డీని 6.70 శాతానికి తగ్గించినట్లు బ్యాంక్‌ ప్రకటించింది. కొత్త లోన్లకు ప్రాసెసింగ్‌ ఫీజు కేవలం రూ.1,100 చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. ‘ఫెస్టివల్‌ బొనాంజా’లో భాగంగా 10.25 శాతం వడ్డీపై వ్యక్తిగత రుణాలు కూడా అందిస్తున్నట్లు తెలిపింది. దీనికోసమైతే రూ.1,999 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌ వినియోగదారులకు 10శాతం రాయితీ, లగ్జరీ బ్రాండ్ల కొనుగోలుపై 10% క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా 50% వరకు, ప్రయాణ వెబ్‌సైట్లలో 25% రాయితీ ఇస్తున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది.