ఓయో రూ.8,430 కోట్ల ఐపీఓ

జొమాటొ పబ్లిక్ ఇష్యూ బంపర్ హిట్ కావడంతో భారీ ఇష్యూలు మార్కెట్‌లోకి వస్తున్నాయి.
దేశంలో అతిపెద్ద హోటళ్ల నిర్వహణ స్టార్టప్ ఓయో పబ్లిక్ ఇష్యూ కోసం రెడీ అవుతోంది. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రతిపాది పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ రూ.8,430 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఈ ఇష్యూ ద్వారా అధిక భాగం షేర్లు కొత్త ఈక్విటీ జారీ చేయడంతో సమీకరించనుంది. ఈ ఇష్యూలో భాగంగా ప్రస్తుత వాటాదారులు కూడా రూ.1,430 కోట్ల షేర్లను అమ్ముకోనున్నారు. జొమాటొ మాదిరిగానే ఈ కంపెనీ కూడా ప్రారంభం నుంచి నష్టాల్లోనే ఉంది.