For Money

Business News

ఐఫోన్‌ 14 ప్రొ మ్యాక్స్‌ ధర రూ.1.34 లక్షలు!

ఐఫోన్‌ కొత్త సిరీస్‌ హంగామా అపుడే మొదలైంది. ఐఫోన్‌ 14 సిరీస్‌లో ఎన్ని రకాల ఫోన్లు ఉంటాయి? మినీ ఫోన్‌ ఉంటుందా? ఫీచర్స్‌ ఏమిటి? ధర ఎంత? ఇలాంటి ప్రశ్నలతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. సెప్టెంబర్‌ 13న ఐఫోన్‌ 14 సిరీస్‌ను యాపిల్‌ విడుదల చేయనుంది. ఇపుడున్న ఐఫోన్‌ 13 సిరీస్‌ కంటే కొత్త సిరీస్‌ ఫోన్లు ఖరీదుగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కొత్త సిరీస్‌ను 9 కోట్ల ఫోన్లను యాపిల్‌ ప్రారంభించనుంది. అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్న ఈ సిరీస్‌లో మినీ ఫోన్‌ ఉండదని తెలుస్తోంది. ఇపుడు మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే 128 జీబీ మోడల్‌ ఐఫోన్‌ ప్రొ ధర 1100 డాలర్లు అంటే రూ. 86895 ఉండొచ్చు. ఇక 128జీబీతోనే ఐఫోన్‌ 14 ప్రొ మ్యాక్స్‌ ధర 1200 డాలర్లు అంటే రూ. 94794 ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఒక టెరా బైట్‌ ఫ్లాష్‌ మెమరీతో వచ్చే ఐఫోన్‌ 14 ప్రొ మ్యాక్స్‌ ధర 1700 డాలర్లు అంటే రూ. 1,34,292 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఐఫోన్‌ 14, ఐ ఫోన్ 14 మ్యాక్స్‌లు A15 బయోనిక్‌ చిప్‌సెట్‌తో వస్తాయని, అదే ఐఫోన్‌ 14 ప్రొ, 14 ప్రొ మ్యాక్స్‌ ఫోన్లు A16 బయోనిక్‌ చిప్‌సెట్‌తో వస్తాయని తెలుస్తోంది.