For Money

Business News

HYD: లీటర్ పెట్రోల్‌ రూ.102

పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా శనివారం చమురు ధరలు మళ్లీ పెరిగాయి. మే 4వ తేదీ తర్వాత ఇంధన ధరలు పెరగడం ఇది 31వ సారి. తాజాగా శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.102కు చేరువైంది. ప్రస్తుతం ధర రూ.101.96కు పెరిగింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 109.30 చేరగా.. డీజిల్‌ రూ.101.85కు చేరింది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు:
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.98.11, డీజిల్ రూ.88.65
ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.104, డీజిల్‌ రూ.96.16
చెన్నైలో పెట్రోల్ లీటర్‌ రూ. 99.19, డీజిల్ రూ.93.23
కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ రూ. 97.97, డీజిల్ లీటర్ రూ.91.50