For Money

Business News

గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలిడే

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ తీవ్ర విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తగినంత విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో… హెచ్‌టీ, ఎల్‌టీ వినియోగదారులకు ప‌వ‌ర్ హాలిడే ప్రక‌టించింది. ప్రభుత్వం. వారానికి ఒక రోజు ప‌వ‌ర్ హాలిడేగా ప్రక‌టించింది. రోజుకు విద్యుత్‌ కొరత 500 మెగావాట్లు దాటడంతో పవర్‌ హాలిడే ప్రకటించినట్లు గుజరాత్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (జీయూ వీఎన్‌ఎల్‌) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అన్ని హైటెన్షన్‌, లో టెన్షన్‌ వినియోగదారులకు ఈ పవర్‌ హాలిడే వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది.
పవర్‌ హాలిడే రాష్ట్రంలో కొత్త కాదని, అనేక సంవత్సతరాల నుంచి అమల్లో ఉందని తెలిపింది. గతంలో పారిశ్రామిక వేత్తలు స్వచ్ఛందంగా అమలు చేసేవారని, కాని ఈ ఏడాది విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉన్నందున… ప్రభుత్వం తప్పనసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుజరాత్‌ ఊర్జా నిగమ్‌ అధికారులు తెలిపారు. రైతుల‌కు స‌రిప‌డా విద్యుత్ స‌ర‌ఫ‌రా లేని కార‌ణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.