బడ్జెట్ రూ. 39 లక్షల కోట్లు.. అప్పు రూ.16.6 లక్షల కోట్లు
రాష్ట్రాలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయని తెగ బాధపడిపోతుంటారు బీజేపీ నేతలు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రుణాల మొత్తం ఏకంగా 60 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ బడ్జెట్ విషయానికొస్తే 22-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 39.11లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అంటే బడ్జెట్‌గా నిర్ణయించింది. చిత్రమేమిటంటో ఇందులో కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 19.34 లక్షల కోట్లు కాగా, నాన్ ట్యాక్స్ ఆదాయం రూ.2.69 లక్షల కోట్లు. ఇక ఇతర మార్గాల ద్వారా రూ. 65,000 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేస్తున్నారు. మిగిలిన రూ.16.61 లక్షల కోట్లను మార్కెట్ నుంచి రుణాల రూపంలో తీసుకురానున్నారు. 6.4 శాతం ద్రవ్యలోటు ఉంటుందని అంటే రూ.16.61 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. మరోలా చెప్పాలంటే ఆర్థికలోటుకు సమాన మొత్తం అప్పుల రూపేణా తీసుకు వస్తున్నారని అర్థం. నిజానికి బడ్జెట్లో అత్యధిక మొత్తం అంటే 35 శాతం మొత్తం అప్పుల రూపేణా కేంద్రం తెస్తోంది. మరో ముఖ్యమైన విషయమేమింటే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. రూ.16.61 లక్షల కోట్లు అప్పుగా తెస్తే… రూ.9.40 లక్షల కోట్లు కేవలం వడ్డీ కిందే చెల్లించడానికి ఖర్చు పెట్టడం.