For Money

Business News

బడ్జెట్‌ హైలెట్స్‌… LIVE

    • హౌసింగ్‌ ప్రాజెక్టులకు రూ.48000 కోట్లు
    • డ్రోన్‌ తయారీ స్టార్టప్‌లకు ప్రోత్సహం
    • 8 రోప్‌ వే ప్రాజెక్టులకు ఆమోదం
    • స్కూల్స్‌ కోసం డిజిటల్‌ యూనివర్సిటీ
    • వ్యవసాయ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తాం
    • ECLGS వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగింపు
    •  రానున్న మూడేళ్ళలో కొత్తగాఅర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు రైల్వేలత అనుసంధానం
    • వచ్చే మూడేళ్ళలో 400 కొత్త జనరేషన్‌ వందే భారత్‌ రైళ్ళు
    • వచ్చే మూడేళ్ళలో 100 కొత్త ఆర్గో టర్మినల్స్‌
      రూ. 2.37 లక్షల కోట్ల ఆహారధాన్యాలను సేకరించాం22-23లో కొత్తగా 25000 కి.మీ. హైవేలు
      ఎంఎస్‌ఎంఈ, సన్నకారు రైతులకు రైల్వేలు ప్రత్యేక ప్రాజెక్టులు
    • నాలుగు రంగాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం
    • మేక్‌ ఇన్‌ ఇండియాతో 60లక్షల మందికి ఉపాధి అవకాశాలు
    • 2021-22 జీడీపీ వృద్ధి రేటు 4.2 శాతం
      14 రంగాల్లో ప్రవేశపెట్టిన పీఎల్‌ఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన
    • స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న లాభాలు
    • నిఫ్టి 224 పాయింట్లు, సెన్సెక్స్‌ 790 పాయింట్లు అప్‌
    • బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

    బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

    2022-23 ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇవాళ ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్‌లో బడ్జెట్‌ పద్దులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆమె బడ్జెట్‌ ప్రవేశపెడతారు. రెండో సారి పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెడతారు. ఆమె బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది నాల్గవ సారి.