For Money

Business News

అదనపు బాదుడుకు కేంద్రం ఓకే

విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు వేరియబుల్‌ చార్జీలను పెంచేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంపెనీలు అడిగిన మొత్తంతో పోలిస్తే చాలా తక్కువగా పెంచేందుకు అంగీకరించింది. యూనిట్‌కు 20 పైసలు అదనంగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వ కమిటీ అంగీకరించింది. టాటా ముంద్రా ప్రస్తుతం రూ. 6.05 వసూలు చేస్తుండగా.. దీన్ని రూ. 6.22కు పెంచారు. ఎస్సార్‌ సలయా ప్లాంట్‌ ధర రూ. 6.88 నుంచి రూ. 7.09కు చేరింది. JSW రత్నగిరి ధర రూ. 6.52 నుంచి రూ. 6.71కు పెరగనుంది. అలాగే మీనాక్షి ఎనర్జి ధర రూ. 7.03 నుంచి రూ. 7.24కు చేరుతుంది. ఇక కోస్టల్‌ ఎనర్జి, ఐటీపీసీఎల్‌ కంపెనీల ధర రూ. 6.6 నుంచి రూ. 6.8కి పెరగనుంది. ప్రస్తుత సవరింపు కారణంగా అత్యధిక ధర మీనాక్షి ఎనర్జి వసూలు చేయనుంది. ఈ కంపెనీకి ఏపీలని తమ్మినపట్నం వద్ద ప్లాంట్‌ ఉంది. ఈ కంపెనీ ఇప్పటి వరకు రూ. 7.03 వసూలు చేస్తుండగా, ఇక నుంచి రూ.7.24 వసూలు చేస్తుంది.