For Money

Business News

ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ పెట్టుబడి?

రిలయన్స్‌ జియోలో 7.7 శాతం వాటా కోసం రూ. 33,737 కోట్లు పెట్టుబడి పెట్టిన గూగుల్‌ కంపెనీ ఇపుడు ఎయిర్‌టెల్‌లో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతోంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చని తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌పై ప్రస్తుతం 1.7 లక్షల కోట్ల రుణ భారం ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు నిధులు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఎలా సమీకరించాలి? ఎంత సమీకరించాలి… వంటి అంశాలను చర్చించి, నిర్ణయం తీసుకునేందుకు ఎయిర్‌టెల్‌ బోర్డు రేపు అంటే ఆదివారం భేటీ కానుంది. జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్‌లో పెట్టుబడి లాభదాయకమని గూగుల్‌ భావిస్తోంది. ఎయిర్‌టెల్‌ కూడా గూగుల్‌తో జతకట్టడం వల్ల ఆ సంస్థ నుంచి భారీగా లబ్ది పొందవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు డేటా అనలటిక్స్‌లో గూగుల్‌కు ఉన్న అనుభవం తనకు పనికి వస్తుందని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది.