For Money

Business News

గోల్డ్‌ రూ.1115, వెండి రూ. 2499

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కరెన్సీ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దాని ప్రభావం మెటల్స్‌పై పడుతోంది. ముఖ్యంగా బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి…నిన్న భారీగా పెరిగాయి. స్పాట్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం రూ. 720 పెరగ్గా.. కిలో వెండిపై రూ.900 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల స్టాండర్డ్‌ బంగారం ధర రూ.720 పెరిగి రూ. 51,280కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ బంగారం ధర 47,000కు చేరింది. ఇక వెండి రేటు రూ.900 పెరుగుదలతో రూ. 69,900కు చేరింది.
ఫ్యూచర్‌ మార్కెట్‌లో…
ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో మాత్రం బులియన్‌ జోరు అధికంగా ఉంది. రాత్రి అమెరికా మార్కెట్‌లో డాలర్‌ అనూహ్యంగా పెరగడంతో పాటు బులియన్‌ కూడా పెరిగింది. దీంతో ఏప్రిల్‌ నెల బంగారం కాంట్రాకట్‌్ రాత్రి రూ. 1115 లాభంతో రూ. 51875 వద్ద ముగిసింది. ఇక వెండి మే కాంట్రాక్ట్‌ ఏకంగా రూ.2499 పెరిగి రూ.68400కు చేరింది. ఇవి రాత్రి ఎంసీఎక్స్‌లో క్లోజింగ్‌ ధరలు. ఇవాళ ఓపెనింగ్‌లో స్వల్పంగా తగ్గే అవకాశముంది.