For Money

Business News

నష్టాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్‌

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో మిశ్రమంగా ఉన్నా… ట్రేడింగ్‌ క్లోజింగ్‌ సమయానికి మూడు ప్రధాన సూచీలు 1.5 శాతంపైగా నష్టాలతో ముగిశాయి. అమెరికా, యూరోపియన్‌ దేశాలు రష్యాపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షల ప్రభావం అటు రష్యాపైనే గాక… ఇతర దేశాలపై కూడా ఉంటోంది. దీంతో అనేక కంపెనీలు వీటి పర్యవసానాలు మదింపు వేస్తున్నాయి. డౌజోన్స్‌ భారీగా క్షీణించడం మార్కెట్‌ను కలవర పరుస్తోంది. డాలర్‌ నిన్న అనూహ్యంగా బలపడింది. డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ 97.35పైన ట్రేడవుతోంది. అమెరికా ఫ్యూచర్స్‌ ఇపుడు స్వల్పంగా గ్రీన్‌లోఉన్నా… అందరి కళ్ళూ ఇపుడు మాస్కో స్టాక్ ఎక్స్ఛేంజీపై పడ్డాయి. గత రెండు రోజుల నుంచి ఈ ఎక్స్ఛేంజీని మూసేశారు. దీంతో ఇవాళ తెరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. రూబుల్‌ మాత్రం పడుతూనే ఉంది.