For Money

Business News

బులియన్‌కు దీపావళి కళ

అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకేసారి బులియన్‌, డాలర్‌ పెరిగితే ఇలాగే ఉంటుంది. ఈ నెల నుంచి ఉద్దీపన ప్యాకేజీకి వారాలవారీగా కోత పెడతామని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ ప్రకటించింది. ఇలా చేయడమంటే పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని సంకేతాలు ఇవ్వడమే. పైగా బాండ్‌ ఈల్డ్స్‌ కూడా పెరిగాయి. డాలర్‌ కూడా అరశాతం పెరిగింది. ఇలాంటి సమయంలో బలహీనంగా ఉండే బులియన్‌.. భారీగా పెరిగింది. ఇక స్టాక్‌ మార్కెట్‌ జోరుకు పగ్గాలు పడినట్లేనని భావించే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇపుడు బులియన్‌లో పెట్టే అవకాశముంది. దీంతో ఇవాళ బంగారం 2 శాతం దాకా పెరిగితే వెండి మూడు శాతం పైగా పెరిగింది.ఇవాళ మనదేశంలో కమాడిటీ మార్కెట్లలో కూడా మూరత్‌ ట్రేడింగ్‌ జరిగింది. ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్‌లో స్టాండర్డ్ బంగారం (డిసెంబర్‌ కాంట్రాక్ట్‌) ధర రూ. 571 పెరిగింది. అలాగే వెండి డిసెంబర్‌ కాంట్రాక్ట్ ధర కూడా రూ. 1,759 పెరిగింది.