For Money

Business News

రూ. 52,600ని తాకిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారం స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర (అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌) రూ. 52600ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే బంగారం రూ. 300 దాకా పెరిగినట్లు లెక్క. ఇవాళ కరెన్సీ మార్కెట్లకు సెలవు. రేపు డిమాండ్‌ రేటును బట్టి బులియన్‌లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. మరోవైపు వెండి ధర రూ. 245 తగ్గింది. సెప్టెంబర్‌ నెల ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ ధర రూ.59312కు పెరిగినా.. ఆ తరవాత తగ్గి ఇపుడు రూ. 58,809 వద్ద ట్రేడవుతోంది.