For Money

Business News

1.5 శాతం క్షీణించిన నాస్‌డాక్‌

చిప్‌ తయారీ కంపెనీ మైక్రాన్‌ నిరాశాజనక ఫలితాలను ప్రకటించడంతో పాటు గైడెన్స్‌ తగ్గించడంతో టెక్‌ కంపెనీల్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నాస్‌డాక్‌ 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా అరశాతం నష్టపోయింది. డౌజోన్స్‌ మాత్రం కేవలం 0.14 శాతం నష్టంతో ట్రేడవుతోంది. డాలర్‌ స్వల్పంగా క్షీణించినా.. డాలర్‌ ఇండెక్స్‌ 106పైనే ఉంది. ఇరాన్‌ నుంచి సరఫరా పెరగనుందనే వార్తలతో క్రూడ్‌ ధరల్లో పతనం కొనసాగుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 95.82 డాలర్లకు పడింది. అమెరికా WTI క్రూడ్‌ ధర 90 డాలర్ల దిగువకు వచ్చింది. అంతకుమునుపు యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ ఒకశాతంపైగా నష్టంతో ముగిసింది.