For Money

Business News

రూ.50,000 దిగువన అందిన మద్దతు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తీవ్ర ఒత్తిడి వస్తోంది. పైగా డాలర్‌తో రూపాయి బలపడేసరికి మన మార్కెట్‌లో బంగారం ధర మరింత తగ్గుతోంది. నిన్న స్పాట్‌ మార్కెట్‌లో ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం (24 క్యారెట్లు) ధర రూ.480 తగ్గి రూ.50 వేల దిగువకు చేరి రూ.49,830కి పడింది. మొన్న బంగారం ధర రూ.50,300గా ఉన్నది. పసిడితోపాటు వెండి ధర రూ.1,260 తగ్గి రూ.54,350కి చేరింది. హైదరాబాద్‌లోనూ 24 క్యారెట్ల బంగారం రూ.440 తగ్గి రూ.50,180కి, 22 క్యారెట్ల ధర రూ.400 దిగి రూ.46 వేలకు తగ్గింది.
ఫార్వర్డ్‌ మార్కెట్‌లో..
ఇపుడు చాలా మంది ఇన్వెస్టర్లు ఫిజికల్‌ గోల్డ్‌ కంటే స్టాక్‌ మార్కెట్‌లో అధికంగా ట్రేడ్‌ చేస్తున్నారు. ఎంసీఎక్స్‌లో నిన్న బంగారం ధర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ స్టాండర్డ్‌ బంగారం ధర 1,689 డాలర్లకు పడిపోగా, వెండి 18.42 డాలర్లకి చేరింది. దీంతో మన మార్కెట్‌లో రాత్రి ఎంసీఎక్స్‌లో ఆగస్టు డెలివరీ కాంట్రాక్ట్‌ రూ. 49703కి క్షీణించింది. కాని దిగువ స్థాయిలో మద్దతు అందడంతో రూ. 50,431 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్‌లో బంగారం గ్రీన్‌లో ఉండటంతో ఇవాళ ఆరంభంలోనే బంగారం కాంట్రాక్ట్‌ గ్రీన్‌లో ఉండనుంది. రాత్రి వెండి కూడా రూ.54,151కి పడిపోయినా.. క్లోజింగ్‌లో రూ. 55440కి పెరిగింది.