For Money

Business News

బులియన్‌… పతనంలోనూ అదే స్పీడు

వాల్‌స్ట్రీట్‌ గ్రీన్‌లో ఓపెన్‌ కావడంతో పాటు కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ వీక్‌ కావడంతో … మెటల్‌ మార్కెట్‌ అనూహ్య మార్పులు వస్తున్నాయి. వడ్డీ రేట్లను ఫెడ్‌ పెంచుతుందనే వార్తల మధ్య పెరుగుతూ వచ్చిన డాలర్‌ ఒక్కసారిగా వీక్‌ కావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. చైనాకు సరఫరా చేస్తున్న ముడి చమురుకు డాలర్లకు బదులు చైనా యువాన్‌ కరెన్సీని తీసుకోవాలని సౌదీ అరేబియా భావిస్తున్నట్లు వార్తలు రావడంతో డాలర్‌ ఒక్కసారిగా వీక్‌గా మారింది. చైనా లాక్‌డౌన్‌ కారణంగా వీక్‌గా ఉన్న క్రూడ్‌ ఇవాళ మరో 8 శాతం పడింది. క్రూడ్‌తో పాటు అన్ని మెటల్స్‌ పడ్డాయి. ఇవాళ అమెరికా మార్కెట్‌లో బంగారం ధర ఏకంగా రెండున్నర శాతం తగ్గి 1911 డాలర్లకు పడిపోయింది. వెండి మాత్రం 1.4 శాతంమే క్షీణించింది. డాలర్‌ కూడా వీక్‌ కావడంతో మన మార్కెట్‌లో బంగారం పతనం కాస్త తక్కువేనని చెప్పాలి. మల్టి కమాడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌)లో స్టాండర్డ్‌ బంగారం పది గ్రామలు ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ రూ.1044 తగ్గి రరూ.51200లకు చేరింది. ఇక వెండి కూడా రూ. 1081 తగ్గి రూ. 68440 వద్ద ట్రేడవుతోంది. గత అయిదు రోజుల్లో బంగారం ధర రూ.3500 తగ్గింది.