For Money

Business News

2000 డాలర్లు దాటిన బంగారం

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావం కమాడిటీ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తోంది. అనేక మెటల్స్‌ 30 నుంచి 40 శాతం పెరిగాయి. 2020 తరవాత తొలిసారి ఔన్స్‌ బంగారం 2000 డాలర్లను దాటి 2005 డాలర్లకు చేరింది. డాలర్‌ పెరిగినపుడల్లా క్షీణించే బులియన్‌ మార్కెట్‌ యుద్ధం కారణంగా పెరుగుతోంది. దీంతో ఇవాళ ఆసియా మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి కూడా 2 శాతం దాకా పెరిగాయి. మన ఎంసీఎక్స్‌ మార్కెట్‌ 10 గంటలకు ప్రారంభమౌతుంది. ఓపెనింగ్‌లోనే రూ.53,000 దాటనుంది. ఇక వెండి కూడా రూ.71,000ను దాటే అవకాశముంది. ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ బులియన్‌కు మరింత మద్దతు లభించే అవకాశముంది.