For Money

Business News

షేర్‌ పతనం… గోద్రెజ్‌ నిర్ణయం రివర్స్‌

స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా కంపెనీ షేర్‌లో తీవ్ర ఒత్తిడి రావడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. డీబీ రియాల్టీలో గోద్రెజ్ బంధానికి బ్రేక్ పడింది. డీబీ రియాల్టీలో 10 % వాటాను కొనుగోలు చేయడానికి వారెంట్ల ద్వారా రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టాలని గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. డీబీ రియాల్టీ, గోద్రెజ్ ప్రాపర్టీస్ రెండూ జాయింట్ వెంచర్‌లో ఒక్కొక్కటి అదనంగా రూ. 300 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ డీల్‌పై మార్కెట్‌ తీవ్రంగా ప్రతికూలంగా స్పందించింది. స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా తన షేర్‌ పడటం, అదే సమయంలో డీబీ రియాల్టీ షేర్లు మాత్రం అప్పర్ సర్క్యూట్‌ను తాకడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ తన ప్రతిపాదనపై పునరాలోచనలో పడింది. మార్కెట్‌ అనలిస్టులు కూడా ఈ డీల్‌పై ప్రతికూలంగా స్పందించడంతో గోద్రెజ్‌ ప్రాపర్జీస్‌ వెనక్కు తగ్గింది. డీబీ రియాల్టీతో జాయింట్‌ వెంచర్‌ను విరమించుకుంటున్నట్లు గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలిపింది.