For Money

Business News

రేపటి ట్రేడింగ్‌కు ఈ నాలుగు షేర్లు

గత శుక్రవారం మార్కెట్‌ ఒక మోస్తరు నష్టాలతో ముగిసినా.. ఇతర ప్రధాన సూచీల్లో పతనం నామమాత్రంగానే ఉంది. నిఫ్టి 18500 దిగువన క్లోజ్‌ కావడం కాస్త ఆందోళన కల్గించే అంశమైనా.. డిఫెన్సివ్‌ షేర్లకు మద్దతు కొనసాగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన నాలుగు షేర్లు ఇవి. మార్కెట్‌లో హెచ్చుతగ్గులు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున స్టాప్‌ లాస్‌ను కచ్చితంగా పాటించండి.
కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
టార్గెట్‌ : రూ. 2300
స్టాప్‌లాస్‌ : రూ. 2075
ఈ షేర్‌లో మూమెంటమ్‌ ఇండికేటర్‌ 14 రోజుల RSI 70 మార్క్‌ను దాటింది. షేర్‌లో ఉన్న అంతర్లీన బలాన్ని ఇది సూచిస్తోంది. మున్ముందు కూడా ఇదే బలంతో ఈ షేర్‌ ముందుకు సాగే అవకాశముంది. ఏమాత్రం ఒత్తిడి వచ్చినా 2075 ప్రాంతంలో మద్దతు రానుంది.
(Vishal Wagh, Research Head-Bonanza Portfolio)

కొనండి
షేర్‌ : నెస్లే ఇండియా
టార్గెట్‌ : రూ. 21,000
స్టాప్‌లాస్‌ : రూ. 19720

ఈ షేర్‌లో మూమెంటమ్‌ ఇండికేటర్‌ 14 రోజుల RSI 60 మార్క్‌ను దాటింది. మరింత పెరిగే బలం ఈ షేర్‌లో ఉందనిపిస్తోంది. మున్ముందు కూడా ఇదే బలంతో ఈ షేర్‌ ముందుకు సాగే అవకాశముంది. ఏమాత్రం ఒత్తిడి వచ్చినా 19720 ప్రాంతంలో మద్దతు రానుంది.
(Vishal Wagh, Research Head-Bonanza Portfolio)

కొనండి
షేర్‌ : హెచ్‌యూఎల్‌
టార్గెట్‌ : రూ. 1900/రూ. 3000
స్టాప్‌లాస్‌ : రూ. 2500

ఈ షేర్‌లో మూమెంటమ్‌ ఇండికేటర్‌ RSI బ్రేకౌట్‌కు సిద్ధంగా ఉంది. RSI 60పైన ముందుకు సాగే బలం ఉన్నందున.. ఈ షేర్‌లో అప్‌ ట్రెండ్‌ కొనసాగే అవకాశముంది. రూ.3100 దాకా వెళ్ళే అవకాశముంది. దిగువ స్థాయిలో రూ. 2500 వద్ద మద్దతు లభించే అవకాశముంది.

(Kunal Shah, Senior Technical and Derivative Analyst at LKP Securities)

అమ్మండి
షేర్‌ : డిక్సన్‌ టెక్నాలజీస్‌
టార్గెట్‌ : రూ. రూ. 3900/రూ.3800
స్టాప్‌లాస్‌ : రూ. 4300

ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో ఈ కౌంటర్‌లో షార్ట్ బిల్డప్‌ పెరుగుతోంది. ఓపెన్‌ ఇంటరెస్ట్‌ పెరుగుతుండగా, ధర తగ్గుతోంది. మూమెంటమ్‌ సూచీలు ఈ షేర్‌లో బలహీనతను చూపుతున్నాయి. లోయ్‌ హై, లోయర్‌ బాటమ్‌ ఫార్మేషన్‌ స్పష్టంగా కన్పిస్తోంది. దిగువ స్థాయిల టార్గెట్‌ రూ. 3900 లేదా రూ. 3700గా కన్పిస్తోంది. అప్‌ట్రెండ్ వస్తే తొలి ప్రతిఘటన రూ. 4300 రానుంది.
(Kunal Shah, Senior Technical and Derivative Analyst at LKP Securities)