For Money

Business News

ఐపీఓ నిధులతో నో బైబ్యాక్‌

షేర్ల బైబ్యాక్‌ కోసం పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ డిసెంబరు 13న భేటీ కానున్న విషయం తెలిసిందే. కంపెనీ నెట్‌ వర్త్‌లో 25 శాతం లేదా 15 శాతం లేదా పది శాతం సరిపోయే మొత్తానికి షేర్లను బైబ్యాక్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కంపెనీ పది శాతం నిధులతోనే బైబ్యాంక్ చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే పది శాతం నిధులతో బైబ్యాంక్‌ చేయడానికి వాటాదారుల అనుమతి ఏలదా సెబీ అనుమతి అక్కర్లేదు. కేవలం బోర్డు మీటింగ్‌తోనే కొనుగోలు చేయొచ్చు. ఇదే సమయంలో ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులు కూడా కంపెనీ వద్ద ఉన్నాయి. అయితే ఆ నిధులతో బైబ్యాంక్‌ నిబంధనలు అనుమతించవని తెలుస్తోంది. తమ వద్ద ప్రస్తుతం నికర నిధులు రూ.9,182 కోట్లని తాజా త్రైమాసిక నివేదికలో పేటీఎం తెలిపింది. ఇందులో రూ. 5600 కోట్ల ఐపీఓ నిధులు కూడా ఉన్నాయి. అంటే మరో రూ. 3500 కోట్లు కంపెనీ వద్ద ఉంటాయన్నమాట. మరి బైబ్యాక్‌కు ఏ ఫార్ములా కింద ఏ మేరకు కొంటారో తెలియాలంటే ఈనెల 13 వరకు ఆగాల్సిందే. ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 18300 కోట్లు సమీకరించిన విషయం తెలిసిందే.