For Money

Business News

ఎస్బీఐ మాజీ చైర్మన్ అరెస్టు

గోదావన్ గ్రూపునకు చెందిన ఒక హోటల్‌కు ఇచ్చిన రుణం కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ చైర్మన్ ప్రతీప్ చౌధిని జైసల్మేర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఎస్బీఐ చైర్మన్‌గా ఏప్రిల్ 7, 2011 నంచి సెప్టెంబరు 30 , 2013 వరకు పనిచేశారు. 2008 లో గోదావన్ గ్రూపు ఎస్బీఐ నుంచి రూ.24 కోట్ల రుణం తీసుకుంది. తర్వాత ఆ సంస్థ బాకీ చెల్లించలేదు. ఈ రుణాన్ని ఎన్‌పీఏగా ప్రకటించడంతో పాటు బ్యాంకు జప్తు కూడా చేసింది. ఈ ఆస్తిని జప్తు చేసిన సమయంలో ప్రతీప్ ఎస్బీఐ చైర్మన్‌గా ఉన్నారు. ఎస్బీఐ ఈ హోటల్‌ అల్ కెమిస్ట్ ఏఆర్సీ అనే సంస్థకు విక్రయించింది. పదవీ విరమణ తర్వాత ప్రతీప్ ఆల్ కెమిస్ట్ ఏఆర్సేలో డైరెక్టర్‌గా చేరారు. ఈ నేపథ్యంలో గోదావన్ గ్రూపు తమ హోటల్‌ను మార్కెట్ ధరకన్నా అతి తక్కువ ధరకు ఆల్కెమిస్టు విక్రయించారని కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తాజాగా కోర్టు ఆదేశాల మేరకు ప్రతీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు.