For Money

Business News

డీఏ పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏ పెంచాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. పెంచిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. తాజా పెంపుతో డీఏ 50 శాతానికి చేరుతుంది. తాజా పెంపువల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 12,868 కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్రం తెలిపింది. తాజా పెంపు వల్ల 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది.