For Money

Business News

బులియన్‌: కొనసాగుతున్న ర్యాలీ

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ మరింత క్షీణించింది. ఈ ఏడాది వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చెప్పడంతో డాలర్‌లో అమ్మకాలు పెరిగాయి. దీంతో బులియన్‌ ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. ఇవాళ అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 2265 డాలర్లను తాకింది. దీంతో మన దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. స్పాట్‌ మార్కెట్‌లో 10 గ్రాముల స్టాండర్డ్‌ బంగారం (24 క్యారెట్లు) ధర రూ.67 వేలను దాటింది. అలాగే వెండి కిలో ధర రూ.74,900 వద్ద కొనసాగుతోంది.