For Money

Business News

వాల్‌స్ట్రీట్‌లో జోష్‌

వడ్డీ రేట్ల తగ్గింపు ఈ ఏడాది ఉంటుందంటూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేసిన వ్యాఖ్యలు స్టాక్‌ మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇపుడు అధిక స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లను ఎంతో కాలం కొనసాగించలేమని ఆయన అన్నారు. అమెరికా చట్టసభల ప్రతినిధుల ముందు ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను వివరించనున్నారు. అలాగే సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు ఆయన జారీ చేసిన లేఖలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని… అలాగే వెంటనే … భారీగా వెంటనే వడ్డీ రేట్లను తగ్గించమని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలా వడ్డీ రేట్లను అధికస్థాయిలో ఉంచమని అన్నారు. పావెల్‌ వ్యాఖ్యలతో వాల్‌స్ట్రీట్‌లోని ప్రధాన సూచీలు 0.8 శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌ 0.95 శాతం లాభంతో ట్రేడవుతోంది. పావెల్‌ వ్యాఖ్యల తరవాత డాలర్‌ ఇండెక్స్‌ అరశాతంపైగా నష్టపోయింది. ఇదే సమయంలో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ భారీగా పెరిగి 84 డాలర్లవైపు దూసుకుపోతోంది. ఇక వెండి రెండు శాతం పెరిగింది.