For Money

Business News

ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాలు

ఇటీవల ఎన్‌బీఎఫ్‌సీలపై ఆర్బీఐ కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా జేఎం ఫైనాన్షియల్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో ఆ షేర్‌ ఇవాళ 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌లో క్లోజైంది. కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని… దానితో పాటు ఆ కంపెనీలో కార్పొరేట్‌ గవర్నర్స్ చాలా అధ్వాన్నంగా ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐపీఓ షేర్లు, డిబెంచర్ల విషయంలో కంపెనీ పనితీరు దారుణంగా ఉన్నందున..ఈ సిగ్మెంట్లలో వ్యాపారం ఆపేయాలని ఆర్బీఐ పేర్కొంది. ఇంతకుమునుపు పేటీఎంలలో కూడా ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల నుంచి ఇన్వెస్టర్లు వైదొలుగుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ప్రైవేట్‌ బ్యాంకులకు మళ్ళిస్తున్నాయి. దీంతో ఇవాళ కూడా బ్యాంకు షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి.