ఫ్లిప్‌కార్ట్‌పై ఈడీ కొరడా: రూ. 10,600 కోట్లకు నోటీసు
విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు మరో 9 కంపెనీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 10,600 కోట్ల (135 కోట్ల డాలర్లు) జరిమానా విధిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. జులై నెల ఆరంభంలో ఈ నోటీసు జారీ అయినట్లు తెలుస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. 2009 నుంచి 2015 మధ్య ఫ్లిప్‌కార్ట్‌లోకి పెట్టిన పెట్టుబడులకు సంబంధించి షోకాజ్ నోటీసు జారీ అయినట్లు తెలుస్తోంది. 90 రోజుల్లో స్పందించాలని ఈడీ కోరింది. తాము భారత దేశ నిబంధనలను పాటించినట్లు ఫ్లిప్‌కార్ట్ అంటోంది. భారత ప్రభుత్వ అధికారులు అడిగిన సమాచారం తాము అందిస్తామని కంపెనీ పేర్కొన్నారు. WS రీటైల్ ద్వారా భారత్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. 2015లోనే WS రీటైల్ మూతపడింది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజారిటీ వాటా తీసుకున్న విషయం తెలిసిందే.