For Money

Business News

భారీగా క్షీణించిన బంగారం, వెండి

అమెరికాలో ఉద్యోగాల సంఖ్య జులై నెలలో కూడా భారీగా పెరగడంతో డాలర్‌ బలపడింది. నాన్‌ ఫామ్‌ జాబ్స్‌ (వ్యవసాయేతర ఉద్యోగాలు) జులై నెలలో 9.43 లక్షల పెరిగాయి. మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలకు మించి ఉద్యోగ అవకాశాలు పెరగడంతో డాలర్‌ 0.4 శాతం పెరిగి 92.61 వద్ద ట్రేడవుతోంది. దీంతో బులియన్‌ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు గణీయంగా తగ్గాయి. అమెరికా ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం దాదాపు 2 శాతం క్షీణించి 1774 డాలర్లకు పడిపోయింది. ఇక వెండి దాదాపు మూడు శాతం క్షీణించింది. దీంతో భారత్‌లో ఎంసీఎక్స్‌లో బంగారం (అక్టోబర్‌ కాంట్రాక్ట్‌) రూ. 46,856కు క్షీణించింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 48,001 నుంచి రూ. 46,856 క్షీణించింది. వెండి కూడా రెండు శాతం క్షీణించింది.