For Money

Business News

డాలర్‌ అప్‌… క్రూడ్‌ డౌన్‌

కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ రోజు రోజుకూ బలపడుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ 99.93 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ 100ను క్రాస్‌ చేస్తుందా అన్నది చూడాలి. అమెరికా పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ రికార్డు స్థాయిలో 2.763 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌ పెరగడంతో ఆటోమేటిగ్గా క్రూడ్‌ బలహీనపడుతోంది. తాజా సమాచారం మేరకు క్రూడ్‌ 100.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ 100 డాలర్ల దిగువకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డాలర్‌ ప్రభావం బులియన్‌ మార్కెట్‌పై కూడా పడుతోంది. బంగారం కాస్త బలహీనంగా కన్పించినా… వెండి మాత్రం గ్రీన్‌లో ఉంది. డాలర్‌తో రూపాయి బలంగా ఉన్నందున బులియన్‌ ధరలు మన మార్కెట్‌లో భారీగా క్షీణించడం లేదు.