For Money

Business News

భారీ నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

ఈక్విటీ మార్కెట్లలో ద్రవ్యోల్బణ భయం కొనసాగుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ 0.4 శాతం లాభంతో క్లోజ్‌ కాగా, ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌ 1.34 శాతం నష్టంతో ముగిశాయి. టెక్‌, ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ద్రవ్యోల్బణ రేటు భారీగా పెరగడంతో చైనా మార్కెట్లు రెండున్నర శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక హాంగ్‌సెంగ్‌ కూడా దాదాపు మూడు శాతం నష్టంతో ట్రేడవుతోంది. కరెన్సీ మార్కెట్‌లోడాలర్‌ మరింత బలపడింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది.