For Money

Business News

డాలర్‌ డౌన్‌… వాల్‌స్ట్రీన్‌ గ్రీన్‌

వాల్‌ స్ట్రీట్‌ గ్రీన్‌లోఉన్నా… గత మూడు సెషన్స్‌లో భారీగా పెరిగాక… ఇవాళ కాస్త సేదతీరుతున్నట్లు కన్పించింది. నాస్‌డాక్‌ కేవలం 0.13 శాతం లాభంలో ఉండగా, డౌజోన్స్‌ 0.17 శాతం లాభంతో ఉంది.ఈ రెండు సూచీలకన్నా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.45 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఆల్ఫాబెట్‌తో పాటు ఏఎండీ ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ఇక మధ్యాహ్నం ప్రారంభంలో ఆకర్షణీయ ఫలితాలతో ఉన్న యూరో మార్కెట్లు క్లోజింగ్‌ సమయానికి నామ మాత్రపు లాభాలకే పరిమితమైంది. అమెరికా ప్రైవేట్‌ ఉద్యోగాల కల్పన జనవరిలో అంచనాలకు భిన్నంగా వచ్చింది. ఈ నెలలో 207,000 in ప్రైవేట్‌ పేరోల్స్‌ పెరుగుతాయని అంచనా వేయగా, వాస్తవానికి 3,01,000 పేరోల్స్‌ తగ్గాయి. దీంతో డాలర్‌ ఏకంగా 0.45 శాతం క్షీణించింది. క్రూడ్‌ స్థిరంగా ఉండగా, బులియన్‌ ఒక మోస్తరు లాభాలతో ఉంది.