డిజిటల్ రూపీ వచ్చేసింది
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ తొలి పైలట్ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిన్న ప్రారంభించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. రిటైల్ లావాదేవీల కోసం డిజిటల్ రూపీ తొలి పైలట్ ప్రాజెక్టు నెల రోజుల్లోపే ప్రారంభం కానుంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్లలో స్టమర్లు-మర్చంట్లతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లకు మాత్రమే డిజిటల్ రూపీ అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ రూపీ తొలి పైలట్ ప్రాజెక్టుగా సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీ లావాదేవీల సెటిల్మెంట్ యూజ్ కేస్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.