For Money

Business News

నష్టాల్లో SGX NIFTY

మార్కెట్లు మళ్ళీ స్తబ్దుగా మారాయి. మొన్నటి ర్యాలీ తరవాత రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ అర శాతంపైగా నష్టంతో క్లోజ్‌ కాగా నాస్‌డాక్‌ అతి కష్టమ్మీద గ్రీన్‌లో ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలో పెద్ద మార్పు లేదు. డాలర్‌ ఇండెక్స్‌ గ్రీన్‌లో ఉన్నా 105 దిగువనే ఉంది. క్రూడ్ కూడా నిలకడగా ఉంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గందరగోళంగా ఉన్నాయి. జపాన్‌ నిక్కీ దాదాపు రెండు శాతం నష్టంతో ఉంది. హాంగ్‌ సెంగ్‌,దక్షిణకొరియా మినహా మిగిలిన మార్కెట్లు కూడా రెడ్‌లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ గ్రీన్‌లో ఉంది. మెజారిటీ మార్కెట్లు అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి 60 పాయింట్ల నష్టంతో ఉంది. సో.. మన మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభం కానున్నాయి.