ట్రయల్స్… రేపటి నుంచి డిజిటల్ రూపాయి..
డిజిటల్ రూపాయిను రేపటి నుంచి ప్రయోగాత్మకంగా తీసుకు వస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. హోల్‌సేల్ మార్కెట్ అవసరాల కోసం డిజిటల్ రూపాయిని తొలుత ప్రారంభించనున్నారు. సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలకు డిజిటల్ రూపాయిని వినియోగించడం ద్వారా ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంకులు ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో పాల్గొంటాయి. రిటైల్ మార్కెట్ అవసరాల కోసం డిజిటల్ రూపాయి మరో నెలలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.