For Money

Business News

దేవయాని ఇన్వెస్టర్లకు జాక్‌పాట్‌

ఇటీవల క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించిన పలు షేర్లకు రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. అయితే జొమాటో తరవాత ఇదే రంగం నుంచి వచ్చిన మరో కంపెనీ దేవయాని ఇంటర్నేషనల్‌కు విశేష స్పందన లభించింది. ఆగస్టు 6న ముగిసిన ఈ ఇష్యూ 116 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. కంపెనీ రూ. 90లకు షేర్లను ఆఫర్‌ చేయగా, ఇవాళ లిస్టింగ్‌లో షేర్‌ రూ. 140.90లకు చేరింది. అంటే 56 శాతం లాభం పొందింది. కెఎఫ్‌సీ, పిజ్జా హట్‌, కోస్తా కేఫ్‌ రెస్టారెంట్ల ఫ్రాంచైజీ అయిన ఈ కంపెనీ షేర్‌ లిస్టింగ్‌ తీరవాత రూ. 120.30కి పడినా ఇపుడు రూ. 125.75 వద్ద ట్రేడవుతోంది.