For Money

Business News

వొడాఫోన్‌ కస్టమర్ల డేటా చోరీ

వొడాఫోన్‌ ఐడియాకి చెందిన 2 కోట్ల మంది పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్ల కాల్‌ డేటా వివరాల చోరీ జరిగిందని సైబర్‌ఎక్స్‌9 అనే సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చ్‌ సంస్థ వెల్లడించింది. కస్టమర్లు ఏ సమయంలో ఎవరికి కాల్‌ చేశారు? ఎంతసేపు మాట్లాడారు? ఎక్కడి నుంచి కాల్‌ చేశారు? కస్టమర్‌ పూర్తి పేరు, అడ్రస్‌, ఎస్‌ఎంఎస్‌లు పంపిన, అందుకున్న ఫోన్‌ నంబర్లు వంటి వివరాలను సైబర్‌ కేటుగాళ్లు కొట్టేసినట్టు తెలిపింది. ఈ మొత్తం వివరాలను తమ కంపెనీ ఈ నెల 22న వొడాఫోన్‌ ఐడియా కంపెనీకి ఈ-మెయిల్‌ ద్వారా అందజేసినట్టు సైబర్‌ఎక్స్‌9 ఎండీ హిమాన్షు పాఠక్‌ చెప్పారు.
గత రెండేళ్ల నుంచి వొడాఫోన్‌లో సెక్యూరిటీ వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని పేర్కొంది. దీనివల్ల సుమారు 30 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు (డేటా) సైబర్‌ దొంగల బారిన ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ వార్తలను వొడాఫోన్‌ ఐడియా మాత్రం ఈ వార్తలను ఖండించారు. తమ కంపెనీలో ఎలాంటి డేటా చౌర్యం జరగలేదని తెలిపింది. ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ ద్వారానూ ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్టు ప్రకటించింది. సైబర్‌ఎక్స్‌9 నివేదిక దురుద్దేశపూరితమని ఆరోపించింది. కాకపోతే డేటా చౌర్యానికి అవకాశం ఉన్న బిల్లింగ్‌ వ్యవస్థను పూర్తిగా మార్చివేసినట్టు తెలిపింది. తమ నెట్‌వర్క్‌ ఖాతాదారుల డేటా రక్షణకు ఎలాంటి ఢోకా లేదని ప్రకటించింది.