రూ. 1200 కోట్ల క్రిప్టో మోసం
క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 900 మంది పెట్టుబడిదారులను మోసం చేసిన కే.నిషాద్ అనే వ్యాపారవేత్త ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. కేరళకు చెందిన ఈ వ్యాపారవేత్త ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.1,200 కోట్ల మేర మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. ‘మోరిస్ కాయిన్’ అనే పేరుతో క్రిప్టోకరెన్సీని ప్రారంభిస్తున్నట్లు నమ్మించి ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తం సొమ్ము వసూలు చేశారని అధికారులు పేర్కొన్నారు. నిషాద్, అతని పేరుపై ఉన్న కంపెనీలు, బ్యాంక్ ఖాతాలను, బంధువుల స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ నేరం చేసి సంపాదించిన డబ్బుతో నిషాద్ సన్నిహితులు ఆస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. బిట్కాయిన్లు, ఇథీరియం, బీఎన్బీ, వైఎఫ్ఐ వంటి రూ.25 లక్షల విలువైన క్రిప్టోకరెన్సీని కూడా జప్తు చేసినట్లు తెలిపారు.