For Money

Business News

ముకేష్‌ వెనక్కి… జావో ముందుకు

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ‘బినాన్స్‌’ అధిపతి చాంగ్‌పెంగ్‌ జావో ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానానికి చేరారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ తాజాగా ఐశ్వర్యవంతుల సంపదను లెక్కించింది. కెనడా జాతీయుడైన జావో కుటుంబం చైనా నుంచి వలస వచ్చింది. జావో నికర సంపద విలువ 9,600 కోట్ల డాలర్లు (దాదాపు రూ.7.2 లక్షల కోట్లు)గా బ్లూమ్‌బర్గ్‌ లెక్కకట్టింది. ఇప్పటి దాకా ఆ స్థానంలో ఉన్న రిలయన్స్‌ అధిపతి ముకేష్‌ అంబానీ (9,300 బిలియన్‌ డాలర్లు) 12వ స్థానానికి చేరాడు. పదో స్థానంలో ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్‌ (10,700 కోట్ల డాలర్లు) ఉన్నాడు. క్రిప్టో ప్రపంచంలో జావో ‘CZ’గా ప్రసిద్ధి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రిప్టో బిలియనీర్‌ కూడా జావోనే. బినాన్స్‌లో జావోకు 90 శాతం వాటా ఉంది. జావో వద్ద ఉన్న బిట్‌కాయిన్‌ నిల్వలు, బినాన్స్‌ జారీ చేసే బినాన్స్‌ కాయిన్‌లో వాటాలను బ్లూమ్‌బర్గ్‌ లెక్కలోకి తీసుకోలేదని, వాటిని కూడా కలిపితే ఆయన సంపద బిల్‌ గేట్స్‌, జుకర్‌బర్గ్‌ల సంపదకు సమానంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా.