For Money

Business News

నీరసంగా క్రిప్టో కరెన్సీలు

దిగువస్థాయి నుంచి కోలుకున్న క్రిప్టో కరెన్సీలు ఇపుడు నీరసంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధ భయంతో స్టాక్‌ మార్కెట్లు ప్రతి కూలంగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. నష్టాలు పెద్దగా లేకపోయినా…ఈ స్థాయిలో ఒత్తిడి మాత్రం ఎదురవుతోంది. బిట్‌ కాయిన్‌ 1.4 శాతం నష్టంతో 41,637 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథీరియం కూడా 3 శాతం నష్టంతో 2,840 డాలర్ల వద్ద ఉంది. టెథర్‌, యూఎస్‌డీ కాయిన్‌లో పెద్ద మార్పు లేదు. బీఎన్‌బీ మాత్రం మూడు శాతం నష్టంతో 392 డాలర్ల వద్ద ఉంది. ఇక ఎక్స్ఛేంజీల్లో మాత్రం మాత్రం బిట్‌ కాయిన్‌ 3.8 శాతం నష్టంతో రూ. 33,49,999 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం దీనికి ప్రధాన కారణం. అలాగే ఎథెర్‌ కూడా రెండు శాతం తగ్గి రూ. 2,29,909వద్ద ట్రేడవుతోంది. పాలిగాన్‌ 5 శాతంపైగా నష్టపోయి రూ.128 వద్ద ట్రేడవుతుండగా, బీఏటీ 4 శాతం నష్టంతో రూ. 617 వద్ద ట్రేడవుతోంది.