For Money

Business News

99.50 డాలర్లకు క్రూడ్‌ ఆయిల్‌

మరీ బాగోదని అనుకున్నారేమో. తనకు అనుకూలంగా ఉన్న రెండు రాష్ట్రాల్లోకి దళాలను రష్యా పంపాలని నిర్ణయించడంతో ఆయిల్‌ మార్కెట్‌ తీవ్రంగా స్పందించింది. యుద్ధం ప్రారంభమైనట్లే వార్తలు రావడంతో బ్యారల్‌ క్రూడ్‌ ధర రూ.99.50 డాలర్లకు చేరింది. ఇది ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ ధరు. అలాగే ఇది ఏప్రిల్‌ డెలివరీ కాంట్రాక్ట్‌కు సంబంధించిన ధర. ఇక మే కాంట్రాక్ట్‌ కూడా 94 డాలర్లకు చేరడంతో.. భారత్‌ వంటి దేశాలు కంగుతిన్నాయి. దాదాపు మూడు నెలలు ధర 90 డాలర్లపైనే ఉంటుందన్నమాట. ఉక్రెయిన్‌ టెన్షన్‌ ఇలాగే కొనసాగే పక్షంలో స్పాట్‌ మార్కెట్‌లో క్రూడ్‌ ధర 100 డాలర్లను ఈజీగా క్రాస్‌ చేస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు బ్యారల్‌ క్రూడ్‌ ధర 100 డాలర్లు దాటినా… ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ససేమిరా అంటున్నాయి.