For Money

Business News

రష్యాపై అమెరికా ఆంక్షలు

ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించిన రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రకటన చేస్తూ ఆయన వైట్‌హౌస్‌లో కొద్దిసేపు మాట్లాడారు. రష్యా చమురు సంస్థల యజమానులు, బ్యాంకులపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. రెండు పెద్ద ఆర్థిక సంస్థలు, రష్యా ప్రభుత్వం రుణ సంస్థలు, రష్యా ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలను మరో ప్రకటనలో వెల్లడిస్తారు. పుతిన్‌ ప్రపంచాన్ని ఎల్లకాలం ఫూల్స్‌ను చేయలేరని ఆయన విమర్శించారు. తాము తీసుకున్న చర్యల కారణంగా రష్యాను పశ్చిమ దేశాలకు దూరం చేసినట్లు బైడెన్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ మద్దతుగా మరిన్ని దళాలు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. రష్యాపై ఆంక్షలు విధించేందుకు 27 యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు కూడా నిన్న అంగీకరించారు. తమ వంతు ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశాయి.