For Money

Business News

క్రూడ్ అప్‌‌… బులియన్‌ డౌన్‌

అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. ఉద్యోగ అవకాశాలు బాగున్నాయని ఇవాళ్టి జాబ్‌ డేటాతో రూఢి అయింది. దీంతో డిమాండ్‌ పెరుగుతుందన్న అంచనాన క్రూడ్‌ ఆయిల్ ఇవాళ నాలుగు శాతం పెరిగింది. డాలర్‌ ధరలో ఏమాత్రం మార్పు లేకున్నా… క్రూడ్‌ ధర పెరగడంతో మన దిగుమతులు మరింత భారం కానున్నాయి. ఇవాళ బ్రెంట్‌ క్రూడ్‌ 4 శాతంపైగా పెరిగి 98.50 డాలర్లకు చేరింది. డాలర్‌తో రూపాయి మరింత క్షీణించడంతో .. బ్యారెల్‌ క్రూడ్‌ కోసం మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు బులియన్‌ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి క్షీణించాయి. ఔన్స్‌ బంగారం ఒక శాతం దాకా తగ్గి 1700 డాలర్లకు చేరువ అవుతోంది. వెండి రెండు శాతంపైగా క్షీణించింది. అయితే మన మార్కెట్‌లో బులియన్‌ భారీగా క్షీణించకపోవడానికి కారణం… డాలర్‌తో రూపాయి భారీగా క్షీణించడమే. దీంతో ఎంసీఎక్స్‌లో బంగారం కేవలం రూ.77 తగ్గగా, వెండి రూ.626 తగ్గింది. క్రూడ్‌ ఆయిల్‌ ఫార్వర్డ్‌ మార్కెట్‌లో 5 శాతం పైగా పెరిగింది.