For Money

Business News

19% పెరిగిన వంటనూనెల ధరలు

జనవరి నెలలో వంటనూనెల ధరలు 18.7శాతం పెరిగాయి. ఇంకా మాంసం, చేపల ధరలు కూడా 5.47 శాతం, కాయగూరల ధరలు 5.19 శాతం పెరిగాయని కేఉంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే పప్పు ధాన్యాల ధరలు 3.02 శాతం తగ్గడంతో జనవరి నెలలో వినియోగ ధరల సూచీ (CPI) 6.01 శాతానికి పెరిగింది. ఇది ఆర్బీఐ అంచనాలకు మించిన ద్రవ్యోల్బణం ఇది. నవంబర్‌లో 4.91 శాతం, డిసెంబర్‌లో 5.66 శాతం ఉన్న సూచీ జనవరిలో 6 శాతాన్ని దాటింది. వచ్చే నెల నుంచి ధరలు తగ్గుతాయని ప్రభుత్వం అంటోంది. అయితే క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్న తీరు చూస్తుంటే ఫిబ్రవరిలో సీపీఐ తగ్గడం అనుమానమేనని ఆర్థిక వేత్తలు అంటున్నారు.