For Money

Business News

కరోనా ఎఫెక్ట్‌: ఫార్మా షేర్లకు డిమాండ్‌

చైనాతో పాటు జపాన్‌, బ్రెజిల్‌ తదితర దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయన్న వార్తలతో మళ్ళీ ఫార్మా షేర్లకు డిమాండ్‌ వచ్చింది. గత కొన్ని రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న ఈ షేర్లకు కరోనా వార్తలు టానిక్‌లా పనిచేస్తున్నాయి. దాదాపు అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి.దివీస్‌ ల్యాబ్‌ 4 శాతం, సిప్లా 3 శాతం, సన్‌ ఫార్మా, రెడ్డీస్‌ ల్యాబ్‌ 1 శాతంపైగా పెరిగాయి. అరబిందో ఫార్మా 4 శాతం, గ్లెన్‌మార్క్‌ ఫార్మా 7 శాతం, బయోకాన్‌ మూడున్నర శాతం, లారస్‌ ల్యాబ్‌ 3 శాతం చొప్పున లాభంతో ట్రేడవుతున్నాయి.
ఇటీవల భారీగా పెరిగిన ఫర్టిలైజర్స్‌ షేర్లలో ఇవాళ తీవ్ర ఒత్తిడి కన్పిస్తోంది. ఈ రంగానికి చెందిన అనేక షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. నేషనల్ ఫర్లిలైజర్స్‌ 7 శాతం, దీపక్‌ ఫర్టిలైజర్స్‌ 5 శాతం, మంగళూర్‌ కెమికల్స్‌ 4 శాతం, మద్రాస్‌ ఫర్టిలైజర్స్‌ షేర్‌ 10 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అలాగే చక్కెర షేర్లలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. ఉగర్‌ సుగర్‌ 8 శాతం, ద్వారికేష్‌ సుగర్‌ 3 శాతం, ఉత్తమ్‌ సుగర్స్‌ రెండున్నర శాతం, బజాజ్‌ హిందుస్థాన్‌ 2 శాతం చొప్పున నష్టపోయాయి. అయితే ఇవాళ ఫార్మా షేర్లు కాస్త లాభాల్లో ఉన్నాయి.