For Money

Business News

సెంట్రల్‌ బ్యాంక్‌కు భారీ ఊరట

ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌ (పీసీఏ) ఫ్రేమ్‌ వర్క్‌ నుంచి సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఆర్బీఐ మినహాయించింది. ఇప్పటి వరకు పీసీఏ ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్న బ్యాంక్‌ ఇదొక్కటే. నికర ఎన్‌పీఏ అత్యధికంగా ఉండటం, ఆస్తులపై ప్రతిఫలం చాలా తక్కువగా ఉండటంతో 2017లో ఈ బ్యాంక్‌ను పీసీఏ పరిధిలోకి ఆర్బీఐ తెచ్చింది. దీంతో బ్యాంకు డివిడెండ్‌ ప్రకటన. శాఖల విస్తరణ, మేనేజ్‌మెంట్ జీతాలు వంటి అంశాలపై ఆంక్షలు విధించింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు పనితీరు మెరుగ్గా ఉండటంతో పీసీఏ పరిధి నుంచి మినహాయించింది. అయినా కొన్ని షరతులు విధించింది. మొత్తానికి బ్యాంకు ఇక విస్తరణపై దృష్టి సారించే అవకాశముంది. ఈ బ్యాంక్‌ షేర్‌ ఇవాళ కేవలం 0.5 శాతం లాభంతో రూ. 20.35 వద్ద ముగిసింది.