For Money

Business News

జీఎస్టీ పరిహారం ఇవ్వాల్సిందే

జీఎస్టీ నిబంధనలు ఏర్పాటు చేసినపుడు ఉన్న నిబంధనలను అమలు చేయాలని తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి త్యాగరాజన్‌ అన్నారు. గతంలో తెలంగాణ, ఇపుడు తమిళనాడు రాష్ట్రం ఏటా 14 శాతం CAGR తో అభివృద్ధి చెందుతున్నాయని..ఆ మేరకు జీఎస్టీ పెరగాలని…ఒకవేళ తగ్గితే దాన్ని పరిహారంగా ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. కరోనా తరవాత చాలా రాష్ట్రాలు అధిక అభివృద్ధితో ముందుకు సాగుతున్నాయని.. కొన్ని ఇబ్బంది పడుతున్నాయని ఆయన అన్నారు. అయితే అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలకు ఆ మేరకు జీఎస్టీ వసూళ్ళలో వాటా రావాల్సిందేనని అన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ చర్చించి నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం నిర్ణయం తీసుకున్నాక… జీఎస్టీలో చర్చ మంచిది కాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో రాష్ట్రాల మాట వింటున్నారని.. బహుశా త్వరలో ఎన్నికలు వస్తుండటం కారణం కావొచ్చని ఆయన అన్నారు.