For Money

Business News

BUY &SELl: కొత్త సిరీస్‌ జాగ్రత్త

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు వచ్చే వరకు మార్కెట్‌ డల్‌గా ఉండొచ్చు. నిఫ్టి 16,000ను దాటొచ్చు. పడినపుడల్లా నిఫ్టికి మద్దతు లభిస్తోంది. ఇవాళ కూడా ఐటీ షేర్లు మద్దతు ఇస్తాయా అన్నది చూడాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లలో కన్పిస్తున్న ఉత్సాహం సింగపూర్ నిఫ్టిలో కన్పించడం లేదు. ఇవాళ్టి నుంచి జులై డెరివేటివ్స్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ ప్రీమియం ఒకట్రెండు రోజుల్లో తరిగే అవకాశముంది. కాబట్టి అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌ వరకు వస్తే… నిఫ్టికి ఇవాళ ఓపెనింగ్‌లో మద్దతు లభించినా.. వెంటనే అమ్మకాల ఒత్తిడి రానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,790. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15,800ని దాటే అవకాశముంది. నిన్న గరిష్ఠ స్థాయి 15,820 ప్రాంతంలో ఇవాళ కూడా ఒత్తిడి ఎదురు కావొచ్చు. తరువాతి ప్రతిఘటన స్థాయి15,850. ఆసియా మార్కెట్ల స్థాయి లాభాలు మన మార్కెట్లో అనుమానమే. రిస్క్‌ తీసుకునేవారు 15,860 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. ఇవాళ్టి డే ట్రేడర్లకు 15,766 కీలకం. దీనిపైన ఉన్నంత వరకు నిఫ్టిపై పెద్ద అమ్మకాల ఒత్తిడి రాకపోవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 15,720-15,740 మధ్య మద్దతు లభించవచ్చు. సో… కొనుగోలు చేసేవారు 15,700 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. 15,700-15,850 మధ్య నిఫ్టి కదలాడే అవకాశముంది. ఈ రెండు స్థాయిలను క్రాస్‌ చేస్తే పొజిషన్‌ తీసుకోవద్దు.అంటే 15,700 దిగువన కొనుగోలు చేయొద్దు, 15,850 పైన అమ్మొద్దు. నిఫ్టి 16,000వైపు పరుగులు తీసే అవకాశముంది. నిఫ్టి అధిక స్థాయిల్లో ఉంది. క్రూడ్‌, డాలర్‌ పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి కార్పొరేట్‌ ఫలితాలు నిరాశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధిక స్థాయిలో కొనే సాహసం చేయొద్దు. నిఫ్టి పెరిగే వరకు ఆగి… అమ్మడం.. స్వల్ప లాభంతో బయటపడటం మంచిది.