For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిన్న యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. యూరో స్టాక్స్ 50 సూచీ ఒక శాతంపైగా లాభంతో ముగిసింది. రాత్రి అమెరికా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. నిరుద్యోగ భృతి క్లెయిలు మార్కెట్‌ అంచనాలకన్నా తక్కువగా ఉండటంతో వాల్‌స్ట్రీట్‌ సూచీలన్నీ బాగా పెరిగాయి. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు అరశాతంపైగా లాభపడగా… డౌజోన్స్‌ 0.95 శాతం లాభపడింది. నిరుద్యోగ భృతి కోసం దాఖలు చేసిన క్లయిమ్స్‌ తగ్గడమంటే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్లే. పైగా రాత్రి అమెరికాలో వారాంతపు క్రూడ్‌ నిల్వలలు కూడా అంచనాలకు మించి తగ్గాయి. అంటే అమెరికాలో చమురు వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో డాలర్‌ స్థిరంగా ఉండగా, క్రూడ్‌ మరింత పెరిగింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు అన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. అర శాతం నుంచి ఒక శాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి స్థిరంగా ట్రేడవుతోంది. నిన్న భారీగా పెరగడం, ఆర్‌ఐఎల్‌ ఏజీఎం నుంచి మెరుపులు లేకపోవడం… నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా లేదా నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది.