For Money

Business News

నిఫ్టి బాగా పడితేనే కొనండి

ఇవాళ మార్కెట్‌లో పెద్ద మార్పులు ఉండవని, నిఫ్టి బాగా క్షీణిస్తేనే నిఫ్టి కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అన్నారు. నిఫ్టి గనుక కనీసం 100 పాయింట్లు క్షీణిస్తేనే కొనే ఆలోచన చేయాలని ఆయన అన్నారు. నిఫ్టి క్రితం ముగింపు 17,331. ఈ లెక్కన నిఫ్టి 17200 లేదా 17230 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. 17230 దిగువకు నిఫ్టిపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని అన్నారు. మరోపు టెక్నికల్స్ కూడా నిఫ్టికి 17230పైన మాత్రమే గ్రీన్‌లో ఉండే అవకాశముందని, లేదంటే 17160 వైపు పయనించవచ్చని అంటున్నారు. నిఫ్టికి ఇవాళ 17345 కీలకం.ఇకవేళ నిఫ్టి గనుక ఈ స్థాయిని దాటితే 17392 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి రావొచ్చని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు.