For Money

Business News

తొందరపడి కొనొద్దు

మార్కెట్‌ స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది. ఈ మాత్రం నష్టాలకే కొనుగోలు చేయొద్దని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్ సుఖాని అన్నారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ… మార్కెట్‌ నిలదొక్కుకునే పక్షంలో ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ను కొనసాగించవచ్చని.. అయితే కొనుగోలు చేయొద్దని ఆయన అన్నారు. నిఫ్టి 17600 దాకా వస్తేనే కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇస్తున్నారు. పైగా 100 పాయింట్ల స్టాప్‌లాస్‌తో అంటే 17500 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. బ్యాంక్‌ నిఫ్టి కూడా 40600 వరకు పడే వరకు వెయిట్‌ చేయాలని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టిలో ఇప్పటికీ బై సిగ్నల్‌ ఉందని.. కాని కొనుగోళ్ళు మాత్రం ప్రస్తుత స్థాయిలో కాదని ఆయన అన్నారు. డే ట్రేడింగ్‌ కోసం ఫెడరల్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ షేర్లను కొనుగోలు చేయొచ్చని… వోల్టాస్‌, పీవీఆర్‌ షేర్లను అమ్మాలని ఆయన సలహా ఇచ్చారు.